Header Banner

ఈ వయసులో ఈ ఎనర్జీ ఎలా? వైద్య విద్యార్థిని ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానం!

  Sat Mar 08, 2025 20:14        Politics

ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని వైద్య విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర సమాధానమిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్ధవీడుకు చెందిన వైద్య విద్యార్థిని తరణి.. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రశ్నలు వేశారు. దీంతో సీఎం తన ఆరోగ్య సూత్రాలను వివరించారు. “నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకొనే వరకూ పనిలోనే ఉంటాను. మీ కన్నా చురుగ్గా, కొంత మంది యువకుల కన్నా ముందు చూపుతో ఉంటా. ప్రజలకు మంచి చేయాలనే స్వార్థం ఉంది నాది. ఆ మంచి పేరు దక్కించుకోవాలని నిరంతరం ఆలోచిస్తా.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!


అందువల్ల ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ఉంటా. మన నాలుకే మన శత్రువు. మిఠాయిలు చూస్తే తినాలనిపిస్తుంది.. అలా నియంత్రణ కోల్పోతే మధుమేహం వస్తుంది. అక్కడితో ఆగదు మరికొన్ని వ్యాధులు వస్తాయి. అందువల్ల ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. చాలా వరకు మందులకు అలవాటు పడకూడదు. ఒకసారి శరీరం మందులకు అలవాటు పడితే డోస్ పెంచుకుంటూ పోవాల్సిందే. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది. మన ఆరోగ్యం పట్ల నిత్యం పర్యవేక్షణ ఉండాలి. నేను ఓ ఉంగరాన్ని ధరిస్తా. ఇది ఎలక్ట్రానిక్ డివైజ్.. నా ఆరోగ్య సమాచారాన్ని పర్యవేక్షిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నా” అని చంద్రబాబు వివరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #APCM #CBN #health #update #todaynews #flashnews #latestnews